HomeHealthVirtual Autopsy : ఇకనుంచి అరగంటలో శవపరీక్ష..ఎలాగంటే?

Virtual Autopsy : ఇకనుంచి అరగంటలో శవపరీక్ష..ఎలాగంటే?

virtual autopsy system will be introduced in telangana very soon

రోడ్డు ప్రమాదాలు, నేరాలు జరిగి కుటుంబసభ్యులను కోల్పోయిన వారిని తీవ్రంగా వేధించే అంశం శవపరీక్ష. అప్పటికే ఆప్తుడిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వాళ్లకు శవాన్ని కత్తులతో కోసి పరీక్షించే విధానాన్ని తట్టుకోలేరు. పైగా గంటల తరబడి వేచి చూడాలి. అందుకోసమే ఐదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అటాప్సీ విధానాన్ని తీసుకొచ్చింది. త్వరలోనే ఈ విధానం రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాలని ఇటీవలే కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ పద్ధతిలో శవాన్ని ఓ బ్యాగులో చుట్టి సాధారణ సిటీ, ఎమ్మారై స్కానింగ్ మాదిరిగానే ఇందులో పరీక్షిస్తారు. శరీరంలోని అన్ని అవయవాలను స్కాన్ చేసి ఫొటోలు సేకరిస్తారు. అంతర్గత రక్తస్రావం, అవయవ లోపాలు, అసాధారణ గాయాలు వంటివి ఇందులో తెలుస్తాయి. సాధారణ శవపరీక్షకు దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడితే ఈ విధానంలో మాత్రం అరగంటలో శవపరీక్ష పూర్తవుతుంది. సాధారణ శవపరీక్షల నివేదికలకు, వర్చువల్ అటాప్సీ నివేదికలకు పెద్దగా వ్యత్యాసం లేదు. సెక్షన్ 65ఏ, 65 బీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం న్యాయస్థానాలు వీటికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి.

Recent

- Advertisment -spot_img