Homeహైదరాబాద్latest Newsవివేకా హత్య రాజకీయ కుట్ర.. కీలక విషయాలు బయటపెట్టిన వివేకా కుమార్తె

వివేకా హత్య రాజకీయ కుట్ర.. కీలక విషయాలు బయటపెట్టిన వివేకా కుమార్తె

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ కుట్ర అని ఆయన కూతురు సునీత వ్యాఖ్యానించారు. ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో హైదరాబాద్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి పోటీని తన తండ్రి వ్యతిరేకించారని వెల్లడించారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వివేకాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జగన్ వ్యతిరేకించారని ఆరోపించారు.

జగన్‌ అరెస్టయి జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని భుజాన వేసుకొని నడిపించారని వైఎస్‌ వివేకా కూతురు సునీత అన్నారు. దీంతో ఆమెకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని చెప్పారు. ఆమెకు వస్తున్న ఆదరణ చూసి రాజకీయంగా పక్కనపెట్టారని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి షర్మిల పోటీ చేస్తే ప్రమాదమని భావించి విశాఖకు పంపాలని జగన్ నిర్ణయించారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img