ఇదేనిజం, జైపూర్ : యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. గంజాయి, కల్తీ కల్లు వినియోగంతో జరిగే అనర్థాలపై రూపొందించిన వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా మత్తు పదార్ధాలను విక్రయిస్తే, తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.