Homeహైదరాబాద్latest Newsనీళ్ల చుట్టే రాజకీయం

నీళ్ల చుట్టే రాజకీయం

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి

ప్రాజెక్టు పరిశీలన.. అనంతరం మీడియా సమావేశం..

హైదరాబాద్ నుంచి మూడు బస్సులో ఎమ్మెల్యేలు పయనం..

ఇదే నిజం, వరంగల్ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో అధికార, ప్రతి పక్షపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా రాష్ర్టంలో నీళ్ల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కృష్ణాజలాలు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల విషయంలో రెండు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు హీటెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఫిల్లర్లు కుంగిపోవడం.. పలు ప్రాజెక్టుల నిర్మాణంపై బీఆర్ ఎస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ ప్రాజెక్టులను కేంద్రానికి, కృష్ణా బోర్డుకు అప్పజెప్పి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసి ప్రయత్నం చేసింది. ఈ అంశాలపై అంతటా చర్చ నడుస్తుండగా.. అసెంబ్లీలో సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను వివరించగా.. అనంతరం ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించబోమని స్పష్టం చేస్తూ ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో మంగళవారం నల్లగొండలో జరుగబోయే సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి..
    భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడగడ్డ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సందర్శించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టు సందర్శనకు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిపారుదలశాఖ అధికారులతో ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మీడియాతో మాట్లాడుతారు. అనంతరం రోడ్డు మార్గంలో రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్తారు.
RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img