దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను భట్టి ఖండించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. రైతులకు రుణమాఫీ చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాల? అని ప్రశ్నించారు. కక్ష పూరిత రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు.