Homeతెలంగాణపత్రాలు కాదు పథకాలు కావాలి

పత్రాలు కాదు పథకాలు కావాలి

– దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్​ డ్రామా
– ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
– గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా పథకాలు ఇచ్చాం
– మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి

ఇదే నిజం, సూర్యాపేట: ప్రజలకు కావాల్సింది దరఖాస్తు పత్రాలు కాదని.. సంక్షేమ పథకాలు కావాలని మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ దరఖాస్తుల పేరుతో డ్రామా చేస్తోందని ఫైర్​ అయ్యారు. శుక్రవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక సతమతం అవుతోందని ఫైర్​ అయ్యారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో తమ ప్రభుత్వం ఏ పత్రాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. తాము దళారి వ్యవస్థ లేకుండా ఆన్‌లైన్‌ విధానం పెట్టామని తెలిపారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని చెప్పారు. కౌలు రైతులను పాసు పుస్తకం నంబర్లు అడుగుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు పథకాలు అడుగుతున్నారని, పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img