Homeహైదరాబాద్latest Newsమా భూములపై మాకే పూర్తి హక్కు కల్పించాలి.. ముదిరాజ్ కులస్తులు అధికారులకు వినతి

మా భూములపై మాకే పూర్తి హక్కు కల్పించాలి.. ముదిరాజ్ కులస్తులు అధికారులకు వినతి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల భూమి 11 ఎకరాల 20 గుంటలు 984 సర్వే నంబర్ లింగంకుంట వద్ద భూమి ముదిరాజ్ 200 కుటుంబాలకు సంబంధించిన భూమి గత 40 సంవత్సరాల నుండి కబ్జాలో ఉంటున్నామని అట్టి భూమిని సంఘ సభ్యుల పెద్ద మనుషుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయగా వారిలో ముగ్గురు వ్యక్తులు భూమి మా పేరు మీద ఉన్నది మాకే చెందుతుందని ఇలాంటి అభివృద్ధి పనులను చేయరాదని సంఘ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముదిరాజ్ సంఘ సభ్యులు 200 కుటుంబాలు కలిసి స్థానిక తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘ సభ్యులకు సంబంధించిన భూమిలో మామిడి తోట పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని తాసిల్దార్ కోరారు.

అలాగే మా యొక్క ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన భూమి విషయంలో మరి రేకార్డతే డొక్కాడని కుటుంబాలు ఆ యొక్క లింగంకుంట్ల స్థలంలో 13 ఎకరాల భూమి సంఘం కు కలదని అట్టి భూమిలో 40 సంవత్సరాల నుండి కాస్తులో కబ్జాలో ఉన్నామని మా సంఘ సభ్యులకు కొంతమంది వ్యక్తులు పట్టాలు మా పేరు మీద ఉన్నాయి భూమి మాదే అని అంటున్నారు సంఘ సభ్యులకు సంబంధించిన భూమిలో మామిడి చెట్లు పెట్టుకుంటే మా భూమిలో మామిడి చెట్లు ఎలా పెడతారని భూమిలోకి వెళ్లిన 200 కుటుంబాలను వారిని ఇబ్బందులకు గురిచేస్తూ అధికారులతో కేసులు నమోదు చేస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇట్టి భూమిపై సంబంధిత తాసిల్దార్ జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ముదిరాజ్ సంఘ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img