Homeహైదరాబాద్latest Newsవారు ఇచ్చిన హామీని కూడా మేము నెరవేరుస్తాం : మంత్రి కోమటి రెడ్డి

వారు ఇచ్చిన హామీని కూడా మేము నెరవేరుస్తాం : మంత్రి కోమటి రెడ్డి

ప్రైవేట్ పాఠశాలలు మూతపడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇటీవల నల్గొండలో సమీకృత భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత విద్య ఎందుకు అందించలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో ప్రతి విద్యార్థికి విద్యను అందించగలుగుతామన్నారు.ప్రైవేట్ పాఠశాలలు మూతపడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను అందిస్తామని హామీ ఇవ్వలేదని.. బీఆర్ఎస్ ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తామని తెలిపారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

Recent

- Advertisment -spot_img