Homeతెలంగాణతెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తం

తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తం

– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్​బీ స్టేడియంలో గురువారం రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌ ఆహ్వానించారు. అనంతరం రాహుల్‌ గాంధీ ట్విట్టర్​లో ఆ ఫొటోలను షేర్‌ చేశారు.‘తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం’అని రాహుల్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img