Homeహైదరాబాద్latest Newsమండల ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా సేవలు అందిస్తాం: సందుపట్ల అంజిరెడ్డి

మండల ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా సేవలు అందిస్తాం: సందుపట్ల అంజిరెడ్డి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో రజక సంఘం వద్ద ఇటీవల ఈదురు గాలులకు అకాల వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, భాగంగా లూజువైర్ల మరమ్మత్తు లను సిబ్బంది తో వేగవంతంగా పనులను చేపడుతూ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి దగ్గర ఉండి పనులను పరివేక్షించారు . ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఈదురు గాలులకు 120 స్తంభాలు దెబ్బతినగా వాటి స్థానంలో నూతన స్తంభాలను వేసి ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగకుండా సెస్ సిబ్బందితో వేగవంతంగా పనులు చేపట్టామని అన్నారు . విద్యుత్ వినియోగదారులు సమస్యన్న నేరుగా మా సిబ్బందికి తెలిపితే ఎప్పటికప్పుడే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకులు దీటి నర్సింలు, రజక సంఘం వద్ద స్తంభం విరిగి దెబ్బ తిన్నదని తెలుపగానే వెంటనే సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి స్పందించి నూతన స్తంభాన్ని వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీటి నర్సింలు,సద్ది మధు,సెస్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img