HomeతెలంగాణMallikarjuna Kharge : సీఎం ఎవరనేది సాయంత్రంలోగా చెప్తం

Mallikarjuna Kharge : సీఎం ఎవరనేది సాయంత్రంలోగా చెప్తం

– ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: తెలంగాణ సీఎం ఎవరు? మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది? అనే సస్పెన్స్​కు ఇవ్వాల తెరపడే అవకాశం ఉంది. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గే సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు. సోమవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న డీకే శివకుమార్‌, మాణిక్‌రావు ఠాక్రే.. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖర్గేతో భేటీ అవుతారు. ఇప్పటికే తెలంగాణ పరిణామాలపై ఖర్గే సహా కాంగ్రెస్‌ అగ్రనేతలకు డీకే శివకుమార్‌ సమాచారం ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఢిల్లీకి బయల్దేరివెళ్లారు. వారిద్దరు కూడా ఖర్గేతో సమావేశం కానున్నారు.

Recent

- Advertisment -spot_img