Homeరాజకీయాలుజనవరిలో మొత్తం రుణమాఫీ చేస్తాం

జనవరిలో మొత్తం రుణమాఫీ చేస్తాం

– బీజేపీ, కాంగ్రెస్‌వి మాయమాటలు
– ప్రజలు నమ్మి మోసపోవద్దు
– రఘునందన్​రావు గెలిచి నియోజకవర్గానికి దేసిందేమీ లేదు
– దుబ్బాక, మిరుదొడ్డిలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్​రావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చాక మొత్తం రుణమాఫీ చేస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవారం ఆయన దుబ్బాక, మిరుదొడ్డిలో బీఆర్​ఎస్​ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డికి మద్దతుగా రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఉప ఎన్నికల్లో గెలిచాక ఇక్కడ రూపాయి పని చేయలేదని, ఢిల్లీ నుంచి ఏమీ తెలేదని మంత్రి విమర్శించారు. బీజేపీ వాడు గెలిస్తే బోరుబాయి కాడ మోటర్ వస్తదని అనాడే చెప్పానన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 25 వేల కోట్లు ఇవ్వలేదని, ఇప్పుడు రఘునందన్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాయమాటలు చెబుతున్నాయని, ప్రజలు ఆ మాటలు నమోద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ కలలో కూడా కననిది, బ్రహ్మం సైతం చెప్పనిది చేసి చూపెట్టారన్నారు. మేనిఫెస్టోతో పాటు రామక్క పాటను కూడా కాంగ్రెస్, బీజేపీలు కాపీ కొట్టాయని ఎద్దేవా చేశారు. రామక్క పాట తెలంగాణలో దుమ్ము రేపుతున్నది. పార్టీ కాదు, కేసీఆర్ మీద ప్రేమతో కల్వకుర్తికి చెందిన ఒక చెల్లి రాసిన పాటకు కాంగ్రెస్, బీజేపీల గుండెలు జల్లుమంటున్నాయన్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత జనవరి నుంచి రేషన్ మీద పాత సోనా మసూరి సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు. నూకలు బుక్కుమన్న బీజేపీకి తెలంగాణలో నూకలు లేకుండా చేయాలన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తుందని, అందుకే కొంత సమస్య వచ్చిందని, అయినా సీఎం కేసీఆర్ పథకాలు మాత్రం ఆపలేదన్నారు.

Recent

- Advertisment -spot_img