Homeవిచిత్రంWedding on Bridge : వినూత్న రీతిలో వంతెనపై పెండ్లి

Wedding on Bridge : వినూత్న రీతిలో వంతెనపై పెండ్లి

Wedding on Bridge : వినూత్న రీతిలో వంతెనపై పెండ్లి… కెనడాకు చెందిన అబ్బాయి, అమెరికాకు చెందిన అమ్మాయి వినూత్నంగా వంతెన‌పై పెండ్లి చేసుకున్నారు. దాంట్లో ఏముం‌దిలే వింత అనుకుంటున్నారా.. అదేనండీ చెప్పొచ్చేది.

క‌రోనా నేప‌థ్యంలో ఆ జంట వినూత్నంగా ఆలోచించి ప్ర‌పంచ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచారు.

వధువు లిండ్సేది అమెరికాలోని మేన్‌ ప్రాంతం. వరుడు అలెక్స్‌ కెనడాకు చెందిన అబ్బాయి.

అమెరికా,కెనడా సరిహద్దుల్లో నదిపై ఉన్న వంతెనపైనే వారు పెళ్లి చేసుకున్నారు.

పడవల్లో 30 మంది బంధుమిత్రులతో కలిసి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు.

ఆ సమయంలో సరిహద్దు ప్రాంతంలో వంతెనపై పెళ్లి చేసుకోగా, లిండ్సే తల్లితండ్రులు మాత్రం అమెరికా వైపున‌ పడవమీద కూర్చుని ఈ పెళ్లిని చూశారు.

ఇందుకోసం అధికారుల నుంచి వారు ముందే అనుమతి తీసుకున్నారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పెళ్లి చేసుకోవడానికి అధికారులు ఒప్పుకున్నారు.

Recent

- Advertisment -spot_img