Homeలైఫ్‌స్టైల్‌Lose weight like this : ఇలా బరువు తగ్గండి.. గుండెను కాపాడుకోండి..

Lose weight like this : ఇలా బరువు తగ్గండి.. గుండెను కాపాడుకోండి..

Are you overweight .. but your heart is in danger. It is easy to reduce your stomach if you follow these tips with some care in diet

అధిక బరువు ఉన్నారా.. అయితే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే. ఆహారంలో కొన్ని జాగ్రత్తలతో ఈ చిట్కాలు పాటిస్తే మీ పొట్టను తగ్గించేందుకు సులువే.

జామ :  పీచు ప‌దార్థం క‌లిగుండే పండ్ల‌లో జామ ఒక‌టి. ఇందులో విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం   పుష్కలంగా ఉంటుంది.

అంతేకాదు క‌రోనా టైంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి కూడా జామ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఆపిల్ :  ఒక ఆపిల్ తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదంటారు ఆరోగ్య నిపుణులు.

ఇది ర‌క్తంలోని కొవ్వు నిల్వ‌ల్ని త‌గ్గించ‌డంతోపాటు కాలేయంలో త‌యార‌య్యే చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

ఆపిల్‌లో ఉండే మాలిక్ ఆమ్లం శ‌రీరంలోని కొవ్వును క‌రిగిస్తుంది.

సబ్జా గింజలు : ఇవి గింజ‌లే కాదు వీటి పొట్టు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స‌బ్జా గింజ‌ల పొట్టు పేగుల్లోకి కొలెస్ట్రాల్ ప్ర‌వేశించ‌కుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.

శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే అత్యంత శ‌క్తివంతమైన గుణం స‌బ్జా గింజ‌ల‌కే ఉంది.

ద్రాక్ష : ఇందులో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలోని విష‌తుల్యాలతో పోరాడుతుంది.

ఇందులోని ఆంథోసైనిన్స్‌, టానిన్స్‌లు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది.

వెల్లులి :  కొలెస్ట్రాల్ వ‌ల్ల‌నే అధిక ర‌క్త‌పోటుకు గుర‌వుతుంటారు. దీనిని త‌గ్గించ‌డంతో వెల్లుల్లి సూప‌ర్‌గా ప‌నిచేస్తుంది.

పుట్టగొడుగులు : వ‌ర్షాకాలంలో దొరికే పుట్ట‌గొడుగుల‌లో విట‌మిన్ బి, సి, క్యాల్షియం వంటి ఖ‌నిజ ల‌వ‌ణాలు క‌లిగుంటాయి. ఇవి శ‌రీరంలొకి ఫ్యాట్‌ను ద‌రిచేర‌కుండా చేస్తుంది.

డ్రైఫ్రూట్స్ : ఈరోజుల్లో ప్ర‌తిఒక్క‌రూ డ్రైఫ్రూట్స్‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అందులోని బాదంలో ఓలియిక్ యాసిడ్ వ్యాధుల నుంచి గుండెను ర‌క్షిస్తుంది.

అలాగే వాల్‌న‌ట్స్లోని ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా కొవ్వును త‌గ్గిస్తుంది. అన్నిటిక‌న్నా ముఖ్యంగా జీడిప‌ప్పు అసంతృప్త కొవ్వులను నియంత్రిస్తుంది.

బీన్స్ ‌:  రాగి, భాస్వ‌రం, మాంగ‌నీసు, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు బీన్స్‌లో అధికంగా ఉంటాయి.

అంతేకాదు ఇందులోని పీచు, లేసిథిన్‌లు చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటాయి.

ఓట్స్ :  డైట్ మెయింటైన్ చేసేవారంద‌రి ఆహారంలో ఓట్స్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి.

ఇందులోని బీటా గ్లూకస్ అనే పీచు పదార్థం స్పంజిలా పనిచేసి కొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది.

బ్లాక్‌బెర్రీ :  శ‌రీరంలొని పెక్టిన్ కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంప‌డానికి బ్లాక్‌బెర్రీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇందులోని విటమిన్లు గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తాయి.

వంకాయ : శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, ఖనిజలవణాలు వంకాయలో ఉన్నాయి. ఇందులోని ఫైటో న్యూట్రియంట్లు ఆక్సీకరణ ప్రక్రియకు తోడ్పడతాయి.

వీటితోపాటు మొక్క‌జొన్న‌, ధాన్యాలు, బార్లీ, గోధుమ వంటివి కూడా బ‌రువును కొవ్వును క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి.

Recent

- Advertisment -spot_img