Homeలైఫ్‌స్టైల్‌#Pepper #WeightLoss : మిరియాలతో అధిక బరువు తగ్గండి

#Pepper #WeightLoss : మిరియాలతో అధిక బరువు తగ్గండి

Pepper has many wonderful medicinal properties. Especially with them you can easily lose excess weight.

Let’s find out now what to do about it.

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను వంటింటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు.

వీటితో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఘాటును కోరుకునే వారు కారంకు బదులుగా మిరియాలను వాడొచ్చు.

అయితే మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా వాటితో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • * కొన్ని మిరియాలను తీసుకుని వాటిని రెండు తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
  • * ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు.
  • * మార్కెట్‌లో దొరికే బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
  • * అల్లం రసం, తులసి ఆకులు, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
  • * అరకప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకొని వాటిని కలిపి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే తాగితే ఎంత లావున్నా తగ్గాల్సిందే!

Recent

- Advertisment -spot_img