Homeహైదరాబాద్latest Newsసంక్షేమం ప్రజల హక్కు: జీవన్ రెడ్డి

సంక్షేమం ప్రజల హక్కు: జీవన్ రెడ్డి

సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమ పథకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండలంలోని బతికేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ యాష్మిన్ బాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నీళ్ళు, నిధులు ,నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాషా, స్థానిక సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, జెడ్పీటీసీ రాజేందర్ రావు,ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి,ఎంపీటీసీ లు చింతకింది అనసూర్య, లచ్చయ్య, డిపిఓ దేవరాజ్, పిఆర్ ఇంజనీర్ రెహమాన్, ఎంపిడిఓ పుల్లయ్య, ఎంపీఓ మహేందర్, తహశీల్దార్ ఎం.ఏ ఫరూక్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img