పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తుతాం. ఇక పామును పట్టుకోవాలంటే.. అబ్బో ఎంతో ఓర్పు, నేర్పు కావాలి. ఈ మేరకు ఓ యువతి చాకచక్యంతో పామును పట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆఫీసు రూమ్ లోకి ఓ పాము వచ్చి కంప్యూటర్ వెనకాల దాగి ఉంటుంది. అయితే దానిని పట్టేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్ ఎలాంటి భయం లేకుండా అక్కడికి వెళ్ళి పామును పట్టుకుంటుంది. అలాగే ఈ పాము ఎలాంటి హాని చేయదని స్థానికులకు చెబుతూనే క్షణాల్లో సంచిలో వేసుకొని వెళ్తుంది.