యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోడీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్‌కు వెళ్లింది. అక్కడి నుంచి బయల్దేరుతుండగా మహిళ భర్త వచ్చాడు. భార్యతో పాటు ఆమె ప్రియుడిని చూసి భర్త కోపంతో రగిలిపోయాడు. నడిరోడ్డులో భార్యను, ఆమె ప్రియుడిని దారుణంగా కొట్టాడు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పంపించేశారు.