వేలంలో ఓ బంగారు బికినీ రూ.1.46 కోట్లు ధర పలికింది. ‘స్టార్‌వార్స్’ మూవీలో క్యారీ ఫిషర్ ధరించిన బికినీ వేలం వేయగా భారీ ధర వచ్చింది. అమెరికాలోని హెరిటేజ్ ఆక్షన్స్‌లో ఈ వేలం ప్రక్రియ కొనసాగింది. రిచర్డ్ మిల్లర్ డిజైన్ చేసిన డ్రెస్‌కు విశేష గుర్తింపు లభించింది. ఆ చిత్రంలో ప్రిన్సెస్ లేయాగా నటించిన క్యారీ ఈ బికినీని ధరించింది.