న్యూజిలాండ్‌లోని హువా పక్షి ఈకలు.. ప్రపంచంలోనే అతి ఖరీదైన ఈకలుగా మారాయి. మే 20న వెబ్ ఆక్సన్‌హౌస్‌లో జరిగిన వేలంలో ఈ ఫెదర్ రూ.23 లక్షలకు పైగా ధర పలికింది. ఈ పక్షి ఈకను అలంకరణ కోసం వాడతారని ఆక్సన్‌హౌస్ అధికారి హెడ్ లియా మోరీస్ తెలిపారు. ప్రస్తుతం ఈ పక్షులు అంతరించిపోయే జాబితాలో చేరినందు వల్లే.. పక్షి ఈకలకు ఇంత ధర పలికినట్లు వెల్లడించారు.