HomeHealthఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

ఇదే నిజం, జగిత్యాల టౌన్ : ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం పలు చిట్కాలు, జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. డీ హైడ్రేషన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

చేయకూడనివి :

  • మండు వేసవిలో, అథిక ఉష్ణోగ్రత సమయంలో బయట తిరగకూడదు.
  • మద్యపానానికి దూరంగా ఉండాలి.
  • రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినకుండా ఉండటం బెటర్.
  • మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి.
  • ఇంటిలో, చట్టుప్రక్కల శుభ్రత పాటించి దోమలు లేకుండా చూసుకోవాలి.

చేయవలసినవి :

  • నీరు, పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి.
  • పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • శుభ్రంగా రెండు పూటల స్నానం చేయాలి.
  • భోజనం మితంగా చేయాలి.
  • లేతవర్ణం, తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి.
  • ఆరు బయట పడుకున్నా దోమ తెరల వంటివి వాడుకోవాలి.
  • ఎండవేళ ఇంటి వద్దనే ఉండండి. బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపి వంటివి తీసుకుని వెళ్ళండి.

ప్రథమ చికిత్స

  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. శరీర ఉష్ణగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చేస్తుండాలి. ఫ్యాను గాలి/చల్లని గాలి తగిలేలా ఉంచాలి.
  • ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం (ఓ.ఆర్.ఎస్.) తాగించాలి.
  • వడదెబ్బ తగిలి ఆపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు.
  • వీలైనంత తొందరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

Recent

- Advertisment -spot_img