Homeహైదరాబాద్latest Newsవైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా?

వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా?

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రజలకు రిజల్ట్స్ అందాయి. ఈ సారి జరిగిన ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి జగన్ ప్రతీ సభలో అన్నారు. ఏపీ మళ్లీ డెవలప్ కావాలంటే కూటమి గెలవాలని చంద్రబాబు ప్రచారం. ఒక్కసారి అవకాశమివ్వండి అంటూ పవన్ కల్యాణ్ రిక్వెస్ట్. ఇలా రాజకీయ నాయకులు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్నారు. చివరివరకూ పోరాడారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు సామాన్యులకు అందినా అభివృద్ధిలో మాత్రం అంతగా పెద్ద మార్పులేవీ జరగలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన సూపర్ సిక్స్ స్కీం బాగా వర్కవుట్ అయిందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 15 స్థానాల్లోపే చాప చుట్టేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతలా పరిస్థితి దిగజారడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఏపీ ప్రజలు తమ మనసు ఎందుకు మార్చుకున్నారు? వాళ్లను ఇబ్బంది పెట్టిన అంశాలు ఏంటి?

రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా రాజధాని విషయంలో గందరగోళంగా ఉంది. అసంపూర్తిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. ఆశించిన మేర ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడంలో విఫలం. ప్రత్యేకించి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి వాళ్ల దురుసు ప్రవర్తన, వ్యవహార శైలి. కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి కేంద్రీకరించారన్న ఆరోపణలు అనేకం. రోడ్ల మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో విఫలం. పవన్ కల్యాణ్, చంద్రబాబు వంటి ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసి దారుణంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. దురుసుగా మాట్లాడటం, నిర్లక్ష్యపు వైఖరి, జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా పాలించారన్న విమర్శలు. ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, హింస, రివెంజ్ వంటి అంశాలపై ఫోకస్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img