తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలై సమీపంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన క్లాస్‌మేట్‌ను ప్రేమించింది. పాఠశాలలో విద్యార్థుల మధ్య బాలిక, ఆమె ప్రియుడు పెళ్లి చేసుకున్నారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాలిక బంధువులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.