Homeహైదరాబాద్latest Newsఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?.. ఎటువంటి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?.. ఎటువంటి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు?

ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలను రహస్యంగా వినడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్ లో కేవలం ఎదుటి వారు మాట్లాడే సంభాషణలు మాత్రమే వినగలిగే అవకాశం ఉంటుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధం. ఇది అన్ని సందర్భాల్లో చేయరు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వానికి సరైన కారణాలు ఉండాలి.

అలాగే, శాంతి భద్రతల పరిరక్షణ, ఉగ్రవాద చర్యలు లాంటి కారణాలతో అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపుగా 9 వేల ఫోన్ల ట్యాపింగ్ కు ఉత్తర్వులు ఇస్తున్నట్లు సాఫ్ట్ వేర్ ఫ్రీడమ్ అండ్ లా సెంటర్ సంస్థ గతంలో తెలిపింది.

Recent

- Advertisment -spot_img