Homeహైదరాబాద్latest Newsఇచ్చన హామీలు నెరవేర్చమంటే గివేం దిక్కుమాలిన పనులు.. సీఎం హోదాలో ఉండి చరిత్రను కనుమరుగు చేసే...

ఇచ్చన హామీలు నెరవేర్చమంటే గివేం దిక్కుమాలిన పనులు.. సీఎం హోదాలో ఉండి చరిత్రను కనుమరుగు చేసే కుట్రలేంటి?

సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణం, చార్మీ నార్ ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడటం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు. వరంగల్ కోట లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కాకతీయుల 11, 12వ దశాబ్దాల్లో యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదని, పేదల కోసం పని చేసిన వారని అన్నారు. కాకతీయుల కాలంలో తెలంగాణ లో గోలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపూర్, సింగసముద్రం, నల్లగొండ జిల్లాలో పానగల్ ఉదయసముద్రం రిజసర్వాయర్ లతో పాటు వేలాది చెరువులు, కుంటలను నిర్మాణం చేయడంతోనే ఈ రోజు తెలంగాణ రైతాంగం బ్రతికి బట్టగలుగుతుందని ,తెలంగాణ వచ్చాక పదేళ్ళలో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పకుండా తీసుకోవాలని..రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే నేనే స్వయంగా హైకోర్టులో కేసు వేస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ని తీసుకువచ్చి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలని చూస్తున్నారని.. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు హయాంలో తెచ్చిన జాతీయ చిహ్నంలో మార్పులు చేస్తారా అని ప్రశ్నించారు. ఎనిమిది వందల ఏళ్ల కాకతీయుల చరిత్ర కు నిదర్శమైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ లను రాష్ట్రం చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సారనాథ్ స్థూపంపై ఉన్న మూడు సింహాలు, అశోక చక్రం చిహ్నాలు భారత దేశ చిహ్నంలో ఉన్నాయని..మరి అది రాచరిక వ్యవస్థకు సంకేతం కాదా అని ప్రశ్నించారు.భారత ప్రభుత్వం గుర్తించి జాతీయ చిహ్నాలుగా గుర్తించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కాకతీయ తోరణం, చార్మీ నార్ చిహ్నాలను మారిస్తే ఊరుకోబోమని అన్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆంధ్రోళ్లు తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ చరిత్రను తుడిచివేయాలని అనుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తీరును చూస్తుంటే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుందని, సీఎం గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలువదని, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్లు అగుపించడం లేదన్నారు. వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయంతో పాటు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో త్రికుట ఆలయాలు, కట్టడాలు చేశారని పేర్కొన్నారు. కాకతీయులు అనగారిన బీసీ కులానికి చెందిన వారుగా చరిత్రకారులు చెబుతుంటారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు హుందాగా ఉండాలి కానీ ఎవరో చెప్పిన వాటిని నమ్మి ఇలా ప్రవర్తించడం ఏంటని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img