Homeఫ్లాష్ ఫ్లాష్Pawan Kalyan ఫ్యూచర్ ఏంటి.. BJP మాస్ట‌ర్ ప్లాన్‌.. YS Jagan మంత్రంగం ఫ‌లిస్తోందా..

Pawan Kalyan ఫ్యూచర్ ఏంటి.. BJP మాస్ట‌ర్ ప్లాన్‌.. YS Jagan మంత్రంగం ఫ‌లిస్తోందా..

హైద‌రాబాద్ః ఏపీలో రాజ‌కీయాలు ఢిల్లీ గ‌ల్లీ వ‌రకు చ‌ర్చ‌కు తెర‌లేపాయి. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న బీజేపీ, జ‌న‌సేన, వైఎస్సార్‌సీపీ మ‌ధ్య సంబంధాల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నున్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌లో జ‌గ‌న్ చేరితే.. మొత్తం మూడు పదవులు ఇస్తామని ప్ర‌ధాని హామీ ఇచ్చిన‌ట్లు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై ఇంకా బీజేపీ, వైఎస్సార్‌సీపీ వర్గాలు స్పందించడం లేదు.

ఒకవేళ జగన్ ఎన్డీఏలో చేరాలని నిర్ణయం తీసుకుంటే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీతో జతకట్టిన జనసేన పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.

2014 ఎన్నికల్లో పోటీచేయకపోయినా ప‌వ‌న్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన‌ టీడీపీకి మద్దతు ఇచ్చింది.

2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీచేసినా ఆశించిన‌ ఫలితం రాలేదు. ఒక్క సీటుతో స‌రిపెట్టుకుంది.

ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిని మార్చ‌డంతో ప‌వ‌న్‌కు అనుకూలంగా బీజేపీ రాజ‌కీయాలు చేస్తుంద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

పవన్ సీఎం అభ్యర్థి అన్న రేంజ్‌లో సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

రాష్ట్రంలో సమస్యలు, విగ్రహాల ధ్వంసం, ఇతర నిరసన కార్యక్రమాలపై బీజేపీ, జ‌న‌సేన క‌లిపి పోరాటం చేపడుతున్నాయి.

ఇలాంటి సమయంలో వైఎస్సార్‌సీపీ బీజేపీతో జతకడుతుందనే వార్తలు జనసేనకు మింగుడు పడటం లేదు.

అటు టీడీపీతో కలవలేని పరిస్థితి.. వామపక్షాలు ఇక పవన్‌తో కలిసి పనిచేసే పరిస్థితి లేదు.. ఫైనల్‌గా జనసేన సోలో అవుతుందనేది విశ్లేషణ.

జగన్ కేంద్రంలో చేరితే ఏపీలో పవన్ కళ్యాణ్ ఒంటరి అయినట్లే చెప్పాలి.

ఒకవేళ జగన్ కేంద్రంలో చేరినా.. జనసేన కూడా బీజేపీతో పాటూ కొనసాగినా రాష్ట్రంలో జ‌న‌సేన‌కు ఇబ్బందులు తప్పవు.

ఎందుకంటే ప్రజా సమస్యలు, ఏవైనా అంశాలపై ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న పార్టీపై నిరసనలు, ఆందోళనలు చేయడానికి ఉండదు.

Recent

- Advertisment -spot_img