మంచు మోహన్ బాబు- మనోజ్‌ల మధ్య గొడవకు కారణం వెల్లడైంది. వినయ్ కారణంగా గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గొడవ కంటే ముందు వినయ్‌పై మోహన్ బాబు తిట్ల పురాణం అందుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని విష్ణుకు, మనోజ్‌కు వినయ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబుని ఈ విషయమై అడగటానికి మనోజ్ వెళ్లటంతో తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగినట్లు చెబుతున్నారు.