Homeహైదరాబాద్latest Newsమోదీ గెలిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మోదీ అన్నంత పని చేస్తారా?

మోదీ గెలిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మోదీ అన్నంత పని చేస్తారా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్నికల ఫలితాలు మరొకొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో అధికారం ఎన్డీయేదేనని ముక్తకంఠంతో చెబుతున్నాయి. దాదాపుగా బీజేపీ అధికారం ఖరారైనట్టే. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కానున్నారు. గత పదేళ్లుగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ భారత్‌‌ను ప్రపంచపటంలో ప్రత్యేక స్థానంలో నిలిపారు మోదీ. ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు గణనీయంగా జరిగాయి. ప్రత్యేకించి ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్‌ను ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే ఆలోచించేలా మోదీ చేశారు. పుల్వామా దాడి తర్వాత ఇండియా చేసిన బాలాకోట్ దాడులు పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టించాయి. తరచూ జమ్మూ కశ్మీర్‌లో చొరబాట్లతో కవ్వింపు చర్యలకు పాల్పడేది. కాల్పులు, దాడులతో శాంతి లేకుండా ఆటంకాలు సృష్టించేది. మోదీ హయాంలో ఇటువంటి చర్యలు చాలావరకు తగ్గాయి. ఎందుకంటే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంచలనాలు. ఎన్నో ఏళ్ల నుంచి నాన్చుతున్న జమ్మూ కశ్మీర్ సమస్యను ఆర్టికల్ 370 రద్దుతో పరిష్కరించారు.

తాజాగా కొద్దిరోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే పీఓకే ను స్వాధీనం చేసుకుంటామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ భూభాగం ఇండియాదేనని, పాక్ మిలిటరీని, రేంజర్లను అక్కడినుంచి తరిమేస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. ఈ తరణంలోనే పాకిస్తాన్ కూడా పీఓకేపై స్పందించింది. పీఓకే తమది కాదంటూ ఇస్లామాబాద్ కోర్టుకు తెలిపింది. సరిగ్గా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన రోజే పాక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీన్ని బట్టి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని భావించింది. మోదీ అధికారంలోకి వస్తే పీఓకే విషయంలో వెనక్కి తగ్గరని అనుకున్నట్లున్నారు. ఇండియా దాడులు చేయకముందే మర్యాదగా తప్పుకుంటే బాగుంటుందని అనుకున్నారో ఏమో! ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

మోదీ గెలిస్తే పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సిందే. ఇండియా విషయంలో ఎన్నోఏళ్ల నుంచీ ఇబ్బందులు పెడుతోంది. పరిస్థితులను చక్కదిద్దు సామర్థ్యం లేక కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసింది. డేర్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకోలేక వెనకడుగు వేసింది. కానీ ప్రస్తుత బీజేపీ నాయకత్వం ఎంతకైనా తెగించేలా ఉంది. అవసరమైతే యుద్దం చేసేందుకైనా రెడీగా ఉంది. పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టి ప్రయోజనం పొందాలనుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఇండియా అమెరికా రిలేషన్స్ ఇకమీదట ఇంకా బలపడనున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దాదాపు చాలావరకు సర్వే సంస్థలు కేంద్రంలో ఎన్డీయే కూటమికే అధికారం కట్టబెట్టాయి. మోదీ గెలుపు లాంఛనమే. ఇప్పటికే గెలిచిన తర్వాత మొదటి 100 రోజుల కార్యాచరణపై మోదీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏయే అంశాలు ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. మతప్రాదిపకన ముస్లిం రిజర్వేషన్ల రద్దు, పీఓకే స్వాధీనం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img