Homeహైదరాబాద్latest Newsఆ అవార్డు వచ్చినప్పుడు ని ఫీలింగ్ ఏంటీ..బన్నీకి బాలయ్య ఆసక్తికర ప్రశ్న..?

ఆ అవార్డు వచ్చినప్పుడు ని ఫీలింగ్ ఏంటీ..బన్నీకి బాలయ్య ఆసక్తికర ప్రశ్న..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. బాలకృష్ణ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నాలుగో ఎపిసోడ్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.తాజాగా అల్లు అర్జున్ ప్రోమో ని విడుదల చేసారు. ‘పుష్ప 2’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ మరోసారి అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు.
ఈ క్రమంలో జాతీయ అవార్డు వచ్చినప్పుడు ని ఫీలింగ్ ఏంటీ ? అని బన్నీని బాలయ్య ప్రశ్నించారు. ఇప్పటివరుకు ఒక్క తెలుగు నటుడికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనను బాధించిందని బన్ని అన్నారు. ఎలాగైనా సాధించాలని భావించి నేను దాన్ని సాధించానని అల్లు అర్జున్ చెప్పారు. మీరు ‘పుష్ప 3’ మూవీ నేను ‘అఖండ 3’ చేస్తాను అని బాలయ్యతో బన్ని అన్నారు. ఈ నాలుగో ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ పార్ట్ 1 నవంబర్ 15న ఆహ వేదికలో ప్రసారం కానుంది.

Recent

- Advertisment -spot_img