బంగ్లాదేశ్ ప్రభుత్వం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్, టిక్‌టాక్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12.15గంటలకు ఈ యాప్స్ పని చేయడం మానేసినట్లు సమాచారం. రిజర్వేషన్ విధానం పై కొనసాగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బంగ్లా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పౌరులపై తీవ్ర ప్రభావం చూపనుంది.