– రూ. 500 బోనస్ ఎప్పుడిస్తారు?
– రైతుబంధు రూ. 15,000 ఎప్పుడు?
– అన్నదాతలు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు
– యాసంగి సీజన్ ప్రారంభమైంది
– ఎమ్మెల్యే హరీశ్ రావు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కల్లాల్లో ఉన్న వడ్లు ఎప్పుడు కొంటారని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ లీడర్లు తాము అధికారంలో వచ్చిన వెంబడే రూ. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రైతులు తమ వడ్లను ఇంకా పొలాల్లో ఆరబోసుకొని ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. రైతు బంధు విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని మీడియా చాంబర్ వద్ద మాట్లాడారు. రైతు బంధు డబ్బుల విషయంపై ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన ఎకరాకు రూ. రూ. 15 ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మిగ్ జామ్ ఎఫెక్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం జరిగిందని.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని హరీశ్ రావు కోరారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో ఊరూరా తిరుగుతూ రైతులు తమ వరిధాన్యాన్ని అమ్ముకోవద్దని.. తాము అధికారంలోకి రాగానే రూ. 500 బోనస్ ఇచ్చి మరీ వడ్లు కొంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది కాబట్టి.. తాము విమర్శల జోలికి వెళ్లడం గుర్తు చేశారు. భవిష్యత్ లో కచ్చితంగా ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు.