Homeహైదరాబాద్latest Newsభూ సమస్యలు తీర్చేదెవరు..పెండింగ్‌లో 2.06 లక్షల ధరణి దరఖాస్తులు..!

భూ సమస్యలు తీర్చేదెవరు..పెండింగ్‌లో 2.06 లక్షల ధరణి దరఖాస్తులు..!

తెలంగాణాలో పెండింగ్‌ భూ సమస్యలు తరగడం లేదు. ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో డ్రైవ్‌ను రెవెన్యూశాఖ నిలిపివేసింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కోడ్‌ తొలగిపోయేలోపు వివిధ సమస్యలకు సంబంధించి ధరణిలో మరో 60వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య 2.06లక్షలకు చేరుకుంది.
గతంలో జిల్లా కలెక్టర్లకు మాత్రమే ధరణి సమస్యలను పరిష్కరించే అధికారం ఉండేది. అయితే వేలల్లో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ, తహసీల్దార్లకు ఇటీవల లాగిన్ సౌకర్యం కల్పించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పట్టా అసైన్డ్ భూములు వైరాసత్ (పౌతి), ప్రత్యేక భూ వ్యవహారాలు, ఖాతాల విలీనం తదితర బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించి లాగిన్ సౌకర్యం కల్పించామన్నారు. అయితే ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా ఫలితం లేకపోయింది.

Recent

- Advertisment -spot_img