Homeహైదరాబాద్latest Newsఎస్సీ ఎస్టీ రైతులను ఆదుకునేది ఎవరు..?

ఎస్సీ ఎస్టీ రైతులను ఆదుకునేది ఎవరు..?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదేపల్లి శివారులో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013 సంవత్సరంలో ఏడవ విడత భూ పంపిణీ ఎస్సీ ఎస్టీలకు చేయడం జరిగింది. అందులో భాగంగా గాదేపల్లి తీగల ధర్మారం జైన గ్రామాల ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ చేస్తున్నామని చెప్పి 2013 లో అప్పటి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పాస్బుక్కులు ఇవ్వడం జరిగింది. 2014లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హద్దులు చూపిస్తానని చెప్పి గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్ అయినారు మళ్లీ 2018లో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా హద్దులు చూపిస్తానని మాట ఇచ్చి గెలిచిన తరువాత మంత్రి అయినాడు కానీ ఇంతవరకు అద్దులు లేవు 2023 ఎలక్షన్ ముందు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హద్దులు చూపిస్తా అని మాట ఇచ్చి మళ్లీ అవే భూములకు పాత పట్టాలు ఇచ్చి హద్దులు మాత్రం మరిచినారు. ఎస్సీ ఎస్టీ రైతులను ఆదుకునేది ఎవరు? 11 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మరి వీరిని పట్టించుకునేది ఎవరు.

Recent

- Advertisment -spot_img