Homeహైదరాబాద్latest Newsకోల్‌కతాతో ఢీకొనేదెవరు? SRH? RR?

కోల్‌కతాతో ఢీకొనేదెవరు? SRH? RR?

IPL ఫైనల్ రెండో స్పాట్ కోసం శుక్రవారం (మే 24) మరో బిగ్ ఫైట్ జరగనుంది. తోలి క్వాలిఫయర్ లో ఓడిన హైదరాబాద్, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా నాలుగు ఓటముల తర్వాత కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ తన సత్తా చూపించింది. SRH, RR ఇప్పటివరకూ 19 సార్లు తలపడగా, హైదరాబాద్ 10 మ్యాచుల్లో గెలిచింది. రాజస్థాన్ తొమ్మిదింటిలో గెలుపొందింది. హైదరాబాద్‌ జట్టులో బ్యాటింగ్‌ త్రయం అభిషేక్ శర్మ (470), ట్రావిస్ హెడ్ (533), హెన్రిచ్‌ క్లాసెన్ (413) రాణించాలి. ఎస్‌ఆర్‌హెచ్‌తో పోలిస్తే రాజస్థాన్‌కు బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్, హెట్‌మయెర్, పావెల్‌ను అడ్టుకోవడం సన్‌రైజర్స్ బౌలర్లకు అంత సులభం కాదు.పేస్‌ బౌలింగ్‌ విషయానికొస్తే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ కలిసి 45 వికెట్లను పడగొట్టారు. రాజస్థాన్‌లో బౌల్ట్, అవేశ్‌ఖాన్, సందీప్‌ శర్మ 40 వికెట్లు తీశారు. ఐపీఎల్‌ పవర్‌ ప్లే ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు సన్‌రైజర్సే. హెడ్ – శర్మ జోడీ 125 పరుగులు జోడించింది. ఆ తర్వాత లఖ్‌నవూపైనా 107 పరుగులు సాధించింది. రాజస్థాన్‌కు ఈ సీజన్‌లో అత్యధిక పవర్‌ ప్లే స్కోరు 76. కోల్‌కతాపై ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆ జట్టు ఓపెనర్లు చేశారు. దిల్లీపైనా (67) ఫర్వాలేదనిపించారు.ఈ మ్యాచ్‌కు వాతావరణమూ సహకరించాల్సి ఉంది. చెపాక్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే, మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే హైదరాబాద్‌ ఫైనల్‌కు దూసుకెళ్తుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ కంటే ముందుండటమే దానికి కారణం.

Recent

- Advertisment -spot_img