Homeఆంధ్రప్రదేశ్ఇండోసోల్ కంపెనీకి అన్ని ప్రోత్సాహకాలు nఎందుకు?

ఇండోసోల్ కంపెనీకి అన్ని ప్రోత్సాహకాలు nఎందుకు?

– వైసీపీ సర్కారును ప్రశ్నించిన జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

ఇదే నిజం, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం చేసినన్ని పొరపాట్లు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇండోసోల్‌ కంపెనీకి ఇచ్చిన ప్రోత్సాహకాలు మరే కంపెనీకి ఇవ్వలేదన్నారు. సామాన్యులు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇవే ప్రోత్సాహకాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ‘రూ.43,143 కోట్లతో ఇండోసోల్‌ కంపెనీ ఏర్పాటవుతుందన్నారు. 3 విడతల్లో 11,500 మందికి ఉద్యోగాలు ఇస్తుందన్నారు. ఇప్పుడేమో ఉద్యోగాలు 11,500 నుంచి 6 వేలకు తగ్గించారు. ఆరు నెలల్లో 5వేల ఉద్యోగాలు ఎలా తగ్గిపోతాయి? ప్రత్యేక టారిఫ్ ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖకు ఎస్‌ఐపీబీ సూచించింది. 3 రిజర్వాయర్ల నుంచి 115 మిలియన్‌ లీటర్ల నీటి సరఫరా చేయాలని సూచించింది. ఇండోసోల్‌ కంపెనీకి ప్రభుత్వం 5,148 ఎకరాలు కేటాయించింది. రామాయపట్నం పోర్టు వద్ద పదేళ్లకు భూమి లీజుకు ఇచ్చారు. కొత్త విధానం వల్ల ఇండోసోల్‌ కంపెనీ యజమానిగా మారింది. కంపెనీకి మరో 3వేల ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్క ఇండోసోల్‌ కంపెనీకే 8,348 ఎకరాలు కట్టబెట్టారు. దీంతో ఈ కంపెనీ నెల్లూరు జిల్లాలోనే అతిపెద్ద భూ యజమానిగా మారింది. గతంలో రామాయపట్నం పోర్టుకు 4వేల ఎకరాలు, కృష్ణపట్నం పోర్టుకు 4,553 ఎకరాలకు పైగా భూమి కేటాయించారు. సీఎంకు సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే పాలసీ తెచ్చారు. పాలసీ పేరుతో వైసీపీ వాళ్లు స్కాండల్స్‌ చేస్తున్నారు’ అని నాదెండ్ల మనోహర్‌ వివరించారు.

Recent

- Advertisment -spot_img