Homeహైదరాబాద్latest Newsజగన్‌కు వెన్నుపోటు పొడిచి..చంద్రబాబును గెలిపించిన వ్యక్తి?

జగన్‌కు వెన్నుపోటు పొడిచి..చంద్రబాబును గెలిపించిన వ్యక్తి?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత భారీ తేడాతో సీట్లు కోల్పోయిన పార్టీగా అపఖ్యాతి మూటగట్టుకుంది. విజయంతో కూటమి హ్యాపీగా ఉండగా వైసీపీ మాత్రం ఓటమికి గల కారణాలను వెదికే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ కొన్ని విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

“తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌కు మంచి స్నేహం ఉంది. ఇద్దరూ ఒకే పోకడ. అనుకున్నది చేస్తారు. భయపడరు. కేసీఆర్ చెప్పే ఎన్నో విషయాలకు జగన్ తలూపుతారు. అయితే తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కాలు జారి పడి గాయపడ్డారు. శస్త్ర చికిత్స కూడా జరిగింది. జగన్ ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓటమికి గల కారణాలను జగన్‌కు చెప్పారు. అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఫలితాలు తారుమారయ్యాయని అన్నారట. ఇది విన్న జగన్ గుడ్డిగా నమ్మి మా దగ్గర కూడా అభ్యర్థులను మార్చాడు. ముఖ్యవ్యక్తులు పార్టీని వీడుతున్నా మౌనం వహించాడు. అనామకులకు టికెట్లు ఇచ్చాడు. మార్చిన అభ్యర్థులందరూ దారుణంగా ఓడారు. కచ్చితంగా గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్సే దెబ్బతీసింది” అంటూ చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img