Homeహైదరాబాద్latest Newsవరదలపై బురద రాజకీయాలెందుకు?: సీఎం రేవంత్ రెడ్డి

వరదలపై బురద రాజకీయాలెందుకు?: సీఎం రేవంత్ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చే అధికారం కలెక్టర్లకే అప్పగించామని చెప్పారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సూర్యాపేట జిల్లాలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, నివేదిక సమర్పించారని సీఎం తెలిపారు. వరదల కారణంగా చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని.. పంటనష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు పరిహారంగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి కలెక్టర్‌కు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.

Recent

- Advertisment -spot_img