Homeహైదరాబాద్latest Newsమండలంలో విస్తృతంగా వాహన తనిఖీలు

మండలంలో విస్తృతంగా వాహన తనిఖీలు

– అతివేగం ప్రాణాంతకం

– పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జే.ఝాన్సీ

ఇదే నిజం, మహబూబాబాద్: వాహన దారులు మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని చిన్న గుడూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జే ఝాన్సీ తెలిపారు. శనివారం చిన్న గూడూరు నుంచి మహబూబాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ఝాన్సీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. వస్తువులు రవాణా చేసే వాహనాలలో మనుషులను ఎక్కించండటం నిషేదమని, గూడ్స్ వాహనాలలో మనుషులను రవాణా చేయటం వల్ల వాహన ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం వల్ల ప్రయాణం సురక్షితంగా సాగుతుందన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. వాహన దారులు తమ వెంట వాహనాలకు సంభందించిన పత్రాలు తీసుకురావాలని అన్నారు. అతివేగం ప్రమాదాలకు కారణం కావచ్చునని, కావున ప్రతి వాహన దారుడు నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంగా వెళ్లరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సోమన్న మంగ్యా నాయక్, రాము, నరేష్, ఘఫుర్, సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img