Homeహైదరాబాద్కేసీఆర్ ను తిడితే గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తరా..

కేసీఆర్ ను తిడితే గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తరా..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ని తిడితే గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తరా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల మాటలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్న ఆయన హైదరాబాద్ కు ఏమీ చేస్తారో ముందు చెప్పాలన్నారు.

మొన్నటి వరకు కేంద్ర మంత్రులంతా తెలంగాణను ప్రశంసించారని, ప్రధాని సైతం కేసీఆర్ ను ప్రశంసించారని గుర్తు చేశారు.

ప్రకాష్ జవదేకర్ మేము ఎంఐఎం కు మేయర్ పదవి ఇస్తామనడం హాస్యాస్పదమని, ఇంతకు ముందు ఇచ్చామా? ఇప్పుడెందుకు ఎంఐఎం కు మేయర్ ఇస్తాం? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం పైనే ఛార్జ్ షీట్ వేయాలని అన్నారు.

చైనా పై మీ విధానం వల్ల సంతోష్ అనే మా తెలంగాణ బిడ్డ బార్డర్ లో చనిపోయాడని ఆయన అన్నారు. చలాన్స్ కడతామని దొంగ పనులకు మద్దతు ఇస్తారా ? అని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర మంత్రులు తెలంగాణకు క్షమాపణ చెప్పి వెళ్ళాలని అలా కాకుండా కేసీఆర్ ను తిడితే మీకు మరిన్ని కష్టాలు వస్తాయని అన్నారు.

హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించడమే బీజేపీ ఎజెండా అన్న ఆయన బీజేపీ వేస్తోన్న గలాటా లో టీఆర్ఎస్ నేతలు ఎవరూ చిక్కరని అన్నారు.

ఇక సాధారణ వ్యక్తికి అత్యున్నత పదవి ఇచ్చారని స్వయంగా స్వామి గౌడ్ చెప్పారని, అలాంటి వ్యక్తి పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు. పెద్ద పదవి చేసిన అతనికి మళ్ళీ అంతటి పెద్ద పదవి రావాలంటే సమయం పడుతుందని అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img