Homeహైదరాబాద్latest Newsటిల్లు 3 లో రాధిక ఉంటుందా? లేదా ?

టిల్లు 3 లో రాధిక ఉంటుందా? లేదా ?

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు మూడో పార్ట్‌లో రాధిక క్యారెక్టర్‌పై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ పార్ట్‌లో రాధిక ( నేహా శెట్టి) క్యారెక్టర్ సినిమాకు హైలైట్‌గా నిలిచినా..రెండో పార్ట్ టిల్లు స్క్వేర్ లో తన పాత్ర అంతంతమాత్రంగానే ఉంది. కేవలం గెస్ట్ రోల్‌గా మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో మూడో పార్ట్‌లోనైనా లీడ్‌రోల్ ఉంటుందా అని ఫ్యాన్స్ అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ మూవీలతో వరుస హిట్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ మూడో పార్ట్ తీసేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తామని మేకర్స్ చెప్పారు.

ఇదిలా ఉండగా తన పాత్రపై నేహాశెట్టి కామెంట్స్ చేసింది. ‘మేకర్స్ రాధిక పాత్రను ఉంచాలనుకుంటే కంటిన్యూ చేస్తారు. డైరెక్టర్లు ఇచ్చిన పాత్ర గురించే ఆలోచిస్తాను. అలాగే ‘టిల్లు స్క్వేర్‌’లోనూ రాధిక బెంగళూరు వెళ్లినట్లు చూపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంటుందా, లేదంటే టిల్లు కోసం తిరిగి వచ్చేస్తుందా అనేది మనం చెప్పలేం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Recent

- Advertisment -spot_img