Homeహైదరాబాద్latest Newsరెండు స్థానాల్లో గెలిస్తే రాహుల్ దేనికి రాజీనామా చేస్తాడు..?

రెండు స్థానాల్లో గెలిస్తే రాహుల్ దేనికి రాజీనామా చేస్తాడు..?

రాహుల్ గాంధీ ఈ సారి కూడా రెండు స్థానాల నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. సిట్టింగ్ సీటు కేరళలోని వయనాడ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని పార్టీ కంచుకోట రాయ్ బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఫలితాలలో ఆయన రెండు చోట్లా లీడ్ లో కొనసాగుతున్నారు. వయనాడ్, రాయ్ బరేలీలో తన సమీప ప్రత్యర్థుల కన్నా లక్ష పై చిలుకు ఓట్లతో దూసుకుపోతున్నారు. వయనాడ్ లో సీపీఐ నేత అన్నె రాజా కన్నా 1,86,265 ఓట్లతో ముందంజలో ఉండగా.. రాయ్ బరేలీలో బీఎస్పీ నేత ఠాకూర్ ప్రసాద్ కన్నా 1,24,629 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో గెలిస్తే దేనికి రాజీనామా చేస్తాడు అన్న విషయం పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

Recent

- Advertisment -spot_img