Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” నుంచి ఆ అప్డేట్ రానుందా?

పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” నుంచి ఆ అప్డేట్ రానుందా?

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన రాజకీయ అజెండా కారణం గా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈగల్ మరియు ఫైర్ సింబల్స్ తో ఉన్న పోస్ట్ అది. అయితే ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తారని చాలా వార్తలు వచ్చాయి. ఈ అప్‌డేట్ కూడా అలాగే ఉంటుందని అంతా భావిస్తున్నారు. అంతే కాకుండా పోస్టర్‌తో విడుదల తేదీని ప్రకటించాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తునారు. ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img