Homeహైదరాబాద్latest Newsప్రభుత్వం పార్టీ మారినాక అభివృద్ధి గుర్తుకు వస్తుందా? ఎమ్మెల్సీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు

ప్రభుత్వం పార్టీ మారినాక అభివృద్ధి గుర్తుకు వస్తుందా? ఎమ్మెల్సీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు

ఇదేనిజం, రాయికల్: రాయికల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు కట్టి సందర్భంగా వారు మాట్లాడుతు బిఆర్ ఎస్ ప్రభుత్వం పోయాక అధికార మత్తు దిగి ఇప్పుడు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ లకు నాయకులకు అభివృద్ది గుర్తుకు రావడం అత్యంత శోచనీయం అని,డబుల్ బెడ్ రూమ్ లు,మిషన్ భగీరథ లు నిష్ప్రయోజనంగా మారినాయి అని, డిగ్రీ కళాశాల మూత పడిగా ఫైర్ స్టేషన్ ను తరలించారని అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి పట్టణంలో పురపాలక సంఘం పన్నులు పెరిగినప్పుడు కూడ మీరు స్పందించలేదు, మేము వీటి కోసం ఉద్యమాలు చేశామని ఇయ్యాల్ల వచ్చి అడిగే మీకు ప్రశ్నించే నైతికత లేదని రాయికల్ పట్టణంలో రోడ్డు వెడల్పు జరుగుతున్నప్పుడు రెండు కోట్ల రూపాయలతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు, మురికి కాలువల నిర్మాణం చేసి అభివృద్ధి చేశారని అదే విధంగా బైపాస్ రోడ్డుకు టీఆరెస్ ప్రభుత్వం వచ్చిన కూడ తన నిధులలో కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్డు వైడింగ్ చేపిస్తే మీరు ముస్తాబు చేసి మురుస్తున్నారని అన్నారు.

పట్టణంలో త్రివమైన నీటి కొరత ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకపోగానే చెరువు కట్ట క్రింద బావిని తవ్వించి గాజులు పోయించి ఇయ్యల్ల సగం పట్టణానికి నీళ్లు ఇస్తున్నారని ఇయ్యల్ల నీటి కొరత తీర్చుటకు ప్రతి వార్డులు బోరులు వేయించారు అది రోజు మీకండ్లకు కనిపిస్తాలేదా. హేద్దేవ చేశారుఒకటవ వార్డులో ప్రజల అభిష్టం మేరకు యాభై లక్షలతో రోడ్డు వేయించగా మధ్యలో ఆగిపోతే ఒక్కరోజు అయినా అడిగారా అని అది మీకు కండ్లు కనిపించలేదా ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన అనేక గ్రామాలకు లింక్ రోడ్డులు వేయించారని, ఇప్పుడు మీరు అంటున్న డబుల్ బెడ్ రూమ్ లు భూమి సేకరించేలా చర్యలు తీసుకున్న ఘనత ఆయనదే అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ కరెంట్ బిల్ మాపి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అని గుర్తు చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ల గూర్చి బిఆర్ ఎస్ నాయకులు కంగారు పడవద్దని గతం ఇందిరమ్మ ఇండ్లు మేమె ఇచ్చామని మరల ఇండ్లు కూడ అర్హులకు మేమె ఇస్తామని పేరొన్నారు నియోజకవర్గ పునర్వవిభజన అంశంకు సమయం ఉంది నియోజకవర్గం మరీనా మారనున్న జీవన్ రెడ్డి ఎప్పుడు రాయికల్ ప్రజల వైపే ఉంటారని గుర్తు చేశారు గత నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ కౌన్సిల్ మెంబర్ గా పురపాలక సంఘం లో నేను అడిగిన అభివృద్ధి ప్రశ్నలకు అప్పటి పాలకవర్గం స్పందించలేరని వాటికి ఒక్కరు సమాధానం చెప్పలేరని మీడియా అనుమతి ఉంటే నేను మాట్లాడిన ప్రతిదీ ప్రలకు తెలిసేది అని మ్యాకల అనురాధ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, కొయ్యడి మహిపాల్ రెడ్డి ఎద్దండి దివాకర్ రెడ్డి బాపురావు నర్సయ్య, బత్తిని చిన్న భూమయ్య , పొన్నం శ్రీకాంత్ గౌడ్ మొబిస్ షాకీర్ ,రాజేష్ సంతోష్ శివా తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img