Homeజిల్లా వార్తలుఅభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: ఎమ్మెల్యే బండారి

అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: ఎమ్మెల్యే బండారి

ఇదేనిజం, ఉప్పల్: తనను ఆదరించి గెలిపించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈసీఐఎల్ ఎంప్లాయీస్ కో – ఆఫ్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ తరపున ఎఎస్ రావునగర్ డివిజన్లో ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, పావని రెడ్డి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి సొసైటీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, వైస్ ప్రెసిడెంట్ సంగయ్య, ప్రధాన కార్యదర్శి రామ మూర్తి, కృష్ణ మూర్తి, సోమయ్య చారీ, విజయ కుమార్, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img