ఇదేనిజం,శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అన్నీ కాలనీలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యమని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు అసోషియన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయా కాలనీలలో తలెత్తినటువంటి సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారులకు సూచించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతోబ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాననితెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రావు, దశరథ్, జహాంగీర్, ఫ్రాన్సిస్, గోపాల్ రెడ్డి, సంతోష్ ముదిరాజ్, కృష్ణ, ఉమా కిషన్, రజినీకాంత్, నరేష్ నాయక్, శివ ముదిరాజ్, కప్పెర రమేష్, అనిల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, నరేష్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, శివ, రాజేష్, సంతోష్ పాల్గొన్నారు.