Homeలైఫ్‌స్టైల్‌Winter Healthy Soup : చలికాలంలో ఈ సూప్​ చాలా మంచి చేస్తుంది..

Winter Healthy Soup : చలికాలంలో ఈ సూప్​ చాలా మంచి చేస్తుంది..

Winter Healthy Soup : చలికాలంలో ఈ సూప్​ చాలా మంచి చేస్తుంది..

Winter Healthy Soup : చలికాలంలో ఎంత ఆకలిగా ఉన్నా ఏదీ తినాలనిపించదు.

ఎంత రుచికరమైన కూర అయినా నోటికి సహించదు.

అందుకే చాలామంది ఈ కాలంలో సూప్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.

నిజానికి సూప్స్‌ భోజనానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.

ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, చికెన్‌ సూప్‌లను నిత్యం తీసుకుంటే మంచిది.

సూప్‌ చేస్తున్నప్పుడు పీచుపదార్థాలతో పాటు కూరగాయలు ఉడికించిన నీళ్లు కూడా ఇంకుతాయి.

కాబట్టి కూరలతో పోలిస్తే, వీటి ద్వారానే ప్రొటీన్లు ఎక్కువ అందుతాయి.

Over Sleep : అధిక‌ నిద్ర కూడా పెద్ద స‌మ‌స్య‌లు తెస్తుంది

Green Tea Benefits : గ్రీన్‌టీతో ఆరోగ్యం.. దీర్ఘాయిష్షు.. బ‌రువూ త‌గ్గొచ్చు

అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్లకు బాగా ఉపకరిస్తాయి.

రాత్రిళ్లు మళ్లీ వంట చేయాలంటే ఎవరికైనా బద్ధకంగానే ఉంటుంది.

అలాంటప్పుడు సూప్స్‌ కడుపు నింపేస్తాయి.

ఒకేసారి పెద్ద మొత్తంలో చేసుకుని, ఫ్రిజ్‌లో పెట్టి వీలునుబట్టి వేడిచేసుకుని తీసుకోవచ్చు.

సూప్‌లో వెల్లుల్లి, ఉల్లిగడ్డ, మసాలా దినుసులు వేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అలా అని, మార్కెట్లో దొరికే కృత్రిమ సూప్స్‌ జోలికి వెళ్లొద్దు.

ఎందుకంటే, సూప్‌ చిక్కపడేందుకు పిండిని, ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ఉప్పును భారీగా కలుపుతారు వ్యాపారులు.

వీటివల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయే తప్ప ఏమాత్రం లాభం ఉండదు.

Veg vs NonVeg : వెజ్ మంచిదా లేదా నాన్‌వెజ్ మంచిదా.. ఇదిగో ప్రూఫ్స్‌..

Throat Pain : ఈ ఆహారాల‌తో గొంతు సమస్యలు, ఎలర్జీల‌కు చెక్‌

Recent

- Advertisment -spot_img