Homeజిల్లా వార్తలుమంత్రి పొంగులేటి చొరవతో ఈనెల 28న మెగా జాబ్ మేళా.. 5000మందికి ఉద్యోగ కల్పన లక్ష్యం..!

మంత్రి పొంగులేటి చొరవతో ఈనెల 28న మెగా జాబ్ మేళా.. 5000మందికి ఉద్యోగ కల్పన లక్ష్యం..!

ఇదే నిజం, ఖమ్మం: ఉన్నత విద్యను అభ్యసించి కొలువులు రాక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. వారికి కొలువుల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నారు. గతంలో టీజీఎస్టీఈపీ చైర్మన్ కు మంత్రి లేఖ రాసి ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించగా.. స్పందించిన సంస్థ భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమైంది.
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యలో..
ఈ నెల 28వ తేదీన కూసుమంచిలోని బీవీ.రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఇందుకోసం 60కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై.. 5,000మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పించనున్నారు. 7వ తరగతి నుంచి మొదలు.. 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ టెక్, ఎం టెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ విద్యార్హత వరకు వారి స్థాయిలో తగిన కొలువులు చూపనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని సంస్థ పేర్కొంది.
విభిన్న రంగాల్లో… అనేక అవకాశాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో డ్రైవర్ మొదలు.. ప్రతిష్టాత్మక కంపెనీల్లో అనేక ఉద్యోగాలు లభించనున్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటీ విభాగం, మార్కెటింగ్ తదితర రంగాల్లో అభ్యర్థుల అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇంత భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతుండడంతో.. నిరుద్యోగ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు మంత్రి పొంగులేటి చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img