విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అదే సమయంలో 100 రోజుల్లోనే సంకీర్ణ పాలనపై వ్యతిరేకత మొదలైంది అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు అమలు చేయడం లేదు అని అన్నారు. దస్పల్లా, ఎన్సీసీ భూములతో తనకు సంబంధం లేదని.. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.