Homeహైదరాబాద్latest Newsప్రేమ పేరుతో సహజీవనం

ప్రేమ పేరుతో సహజీవనం

-పాప పుట్టాక మోసం
-తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాధితురాలి ఆందోళన

ఇదేనిజం, వర్ని: తాను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకొంటానని మాయమాటలు చెప్పి ఓ యువతితో రెండేళ్ల పాటు సహజీవనం చేసి, పాప పుట్టాక వదిలేయడంతో బాధితురాలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. తనకూ, తన రెండు నెలల పాపకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదని బాధితురాలు గుండవారి లగ్నేశ్వరి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆమె నిరసన చేసి ,తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని తహసిల్దార్ సాయిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు, జలాల్పూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంచి పెళ్లి చేసుకుంటానని, తనతో జీవనం కొనసాగించాడని తెలిపారు. రెండు నెలల క్రితం పాపకు జన్మనిచ్చారని తెలిపారు. పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి, మోసం చేశాడని, ప్రస్తుతం పెళ్లి చేసుకోమంటే ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరింది. అనంతరం తహశీల్దార్ సాయిలు తోపాటు సిఐ జైస్ రెడ్డి తో మాట్లాడి ఫిర్యాదు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img