Homeఫ్లాష్ ఫ్లాష్WONDER:పురుగు దొరికితే మీరు కోటీశ్వరులే..

WONDER:పురుగు దొరికితే మీరు కోటీశ్వరులే..

WONDER:ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రాణులు ఎన్నో ఉంటాయి. కొన్నింటి గురించి తెలిసినపుడు ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా పురుగులు,పాములు పేర్లు తలచుకున్నప్పుడు అదొక జుగుప్స కలుగుతుంది. కానీ చాలా అరుదైన జీవులు ఉంటాయి. కొన్ని అదృష్టానికి మారుపేరు అవుతాయి. అలాంటిదే స్టాగ్ బీటిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగుగా గుర్తించబడింది. దీన్ని పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసొస్తుందని చాలామంది నమ్ముతారు. వీటిని సాధారాణ మార్కెట్లో అయితే లక్షల్లో అమ్ముతారు, కానీ బ్లాక్ మార్కెట్ లో ఏకంగా కోట్ల రూపాయల ధర పలుకుతోంది. నలుపు, చాక్లెట్ రంగులో ఉండే ఈ స్టాగ్ బీటిల్ రెండు నుండి మూడు అంగుళాల పరిమాణంలో ఉంటుంది. దీనికి ముందు భాగంలో కొమ్ములు పొడవుగా ఉంటాయి.చూడగానే ‘అమ్మో ఏం చేస్తుందో..’ అని కాస్త భయపెడుతుంది. కానీ ఈ పురుగును అనేక రకాల మందులను తయారుచేయడంలో ఉపయోగిస్తారట. అందుకే ఇది ఇంత ఖరీదు పలుకుతోందని అంటున్నారు. కాగా ఈ స్టాగ్ బీటిల్ చాలా అరుదైన పురుగు, చలికాలంలో ఎక్కువగా మరణించే ఈ పురుగు ప్రస్తుతం అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉందని చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img